మోదీ.. మీరు ప్యాంట్లు, పైజామాలు వేసుకోకముందే సైన్యం ఉంది!: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ.. మీరు ప్యాంట్లు, పైజామాలు వేసుకోకముందే సైన్యం ఉంది!: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్

  • నెహ్రూ, ఇందిర హయాంలో త్రివిధ దళాలు పటిష్టం
  • మోదీ హయాంలోనే అత్యధిక ఉగ్రదాడులు
  • ఖాన్వాడ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత
దేశ భద్రత, ఆర్మీ విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ పదేపదే విమర్శించడంపై కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ ప్యాంట్లు, పైజామాలు వేసుకోకముందే భారత సైన్యం ఉందని కమల్ నాథ్ చురకలు అంటించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం పటిష్టంగా రూపుదిద్దుకున్నాయని వ్యాఖ్యానించారు. తనను మోదీ భ్రష్ట్ నాథ్(అవినీతికి అధిపతి)అని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్ లోని ఖాన్వాడ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకూ మోదీ హయాంలోనే అత్యధిక ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయని తెలిపారు. 2001లో ఎవరి హయాంలో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా భారత్ తమ హయాంలోనే సురక్షితంగా ఉందంటూ మోదీ డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
India
Congress
Narendra Modi
BJP
army
kamal nath

More Telugu News