రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో కాలేజీలో విద్యార్థుల ఆందోళన!
- పరీక్షలు రద్దు చేసి మళ్లీ చేపట్టాలని డిమాండ్
- ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం
- ఆరుగురు విద్యార్థులు ఛాన్స్ కోల్పోయారని ఆవేదన
ఈ విషయమై ఓ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలకు కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఎలాంటి నోటీసులు లేకుండా హఠాత్తుగా పరీక్షలు నిర్వహించడంతో గత శనివారం ఆరుగురు విద్యార్థులు హాజరుకాలేకపోయారని వ్యాఖ్యానించారు.
ఈ పరీక్షలను రద్దుచేసి మళ్లీ అందరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కళాశాల యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించింది. దీంతో ఇక్కడ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.