రాజమౌళి సినిమాలో చాలా గొప్ప పాత్ర నాది .. బాగా చేయగలననే నమ్మకం వుంది: అలియా భట్
- 'మగధీర' సినిమా చూశాను
- రాజమౌళి గొప్ప దర్శకుడు
- నా పాత్రకి న్యాయం చేస్తాను
తాజాగా ఈ సినిమాను గురించి అలియాభట్ మాట్లాడుతూ .. "రాజమౌళిగారి సినిమా అనగానే నేను ఒప్పుకోవడానికి కారణం 'బాహుబలి' .. అది సాధించిన విజయమని అనుకుంటారు. కానీ నేను ఈ సినిమాను అంగీకరించడానికి కారణం 'బాహుబలి' కాదు .. 'మగధీర'. ఈ సినిమా చూసిన దగ్గర నుంచే నాకు రాజమౌళి సినిమాలంటే ఇష్టం పెరిగింది. కథాకథనాలను జనరంజకంగా ఆవిష్కరించే గొప్ప దర్శకుడాయన. అలాంటి ఆయన దర్శకత్వంలో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా కష్టతరమైనది .. అయినా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను"అంటూ చెప్పుకొచ్చింది.