ఓటరు దేవునికి సాదర స్వాగతం...కేంద్రానికి వచ్చిన వారిపై సిబ్బంది పూలవర్షం
- మేళతాళాలతో ఆహ్వానం
- ఉత్తరప్రదేశ్లో పోలింగ్ సిబ్బంది వినూత్న ఆలోచన
- బాఘ్పట్ లోక్సభ నియోజవర్గంలోని బారౌత్లో ఘటన
ఉత్తరప్రదేశ్ లోని బాఘ్పట్ లోక్సభ నియోజవర్గం పరిధిలోని బారౌత్ పోలింగ్ కేంద్రం సిబ్బంది ఈ చర్య తీసుకున్నారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసేందుకు తామీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 91 లోక్సభ నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే.