ఇమ్రాన్ ఖాన్ కు తప్పిన ముప్పు.. ఆఫీసులో సమావేశంలో ఉండగానే చెలరేగిన మంటలు!

  • ఆరో అంతస్తులో చెలరేగిన మంటలు
  • అప్పుడే సమావేశంలో పాల్గొంటున్న ఇమ్రాన్ ఖాన్
  • అందరూ సురక్షితం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాని ఆఫీసులోని ఆరో అంతస్తులో ఈరోజు ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఐదో అంతస్తులో సమావేశంలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను భద్రతాధికారులు హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు.

మరోవైపు వెంటనే రంగంలోకి దిగిన ఆరు ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు స్పందిస్తూ.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం చెలరేగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
India
Pakistan
Fire Accident
IMRAN KHAN

More Telugu News