సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • యాక్షన్ హీరోతో కాజల్ అగర్వాల్ 
  • పోర్చుగల్ కు నాగార్జున టీమ్ 
  • జపాన్ లో కూడా ప్రభాస్ సినిమా
*  యాక్షన్ హీరో గోపీచంద్ తో కలసి కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటించనుంది. నూతన దర్శకుడు బీను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ ను తీసుకుంటున్నారట.
*  అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మన్మథుడు 2' చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెల 11 నుంచి పోర్చుగల్ లో జరుగుతుంది. రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో అక్కడ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.
*  ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రానికి జపాన్ లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు 'సాహో' చిత్రాన్ని కూడా అక్కడ డబ్ చేసి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడుపోయినట్టు సమాచారం.
Kajal Agarwal
Nagarjuna
Rakul
prabhas

More Telugu News