షూటింగ్ కు తెచ్చిన బైక్, కారును ఇంటికి తెచ్చేసుకున్న ప్రభాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగ్ కు తెచ్చిన బైక్, కారును ఇంటికి తెచ్చేసుకున్న ప్రభాస్!

  • బైక్, కారుపై మనసు పారేసుకున్న ప్రభాస్
  • 'సాహో' ఫైట్ సీన్ల షూట్ తరువాత ఇంటికి
  • ఆగస్టు 15న రానున్న చిత్రం
ఏదైనా క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత, బెయిల్స్ నో, బాల్ నో తీసుకుని దాన్ని జ్ఞాపకంగా దాచుకోవడం ఎన్నోమార్లు చూశాము. సినిమా షూటింగ్ లలో కూడా, నటీ నటులు తమకు బాగా నచ్చిన దుస్తులనో, చిత్రం షూటింగ్ లో భాగంగా వాడిన వస్తువునో తమతో పాటు తీసుకెళుతుంటారు.

ప్రస్తుతం 'సాహో'లో నటిస్తున్న హీరో ప్రభాస్, షూటింగ్ కోసం తెచ్చిన హై ఎండ్ బైక్, కార్ ను తన ఇంటికి తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ సినిమాలో స్టంట్స్ ను కోట్ల రూపాయలు వెచ్చించి షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఫైట్ సీన్లు తీస్తున్నప్పుడే, ఈ కారు, బైక్ పై ప్రభాస్ మనసు పడ్డాడని, అందుకే వాటిని తానే ఉంచేసుకోవాలని భావించారని సమాచారం. కాగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా, నీల్ నితిన్, ఎవ్లిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తుండగా, ఆగస్టు 15న చిత్రం విడుదల కానుంది.
Prabhas
Bike
Car
Home
Sahoo
Shooting

More Telugu News