జిమ్ లో చరణ్ కసరత్తులు .. స్వల్ప గాయం!
- గుజరాత్ లో జరుగుతోన్న షూటింగు
- పూణే షెడ్యూల్ షూటింగు వాయిదా
- చరణ్ జోడీగా అలియా భట్
అందువలన ఆయన రెగ్యులర్ గా జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. నిన్న ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా చీలమండకు చిన్న గాయమైందనే సమాచారాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ గాయం కారణంగా .. పూణేలో జరపవలసిన తదుపరి షెడ్యూల్ షూటింగును వాయిదా వేశారు. చరణ్ కు నొప్పి తగ్గిన తరువాత .. అంటే 3 వారాల తరువాత షూటింగులో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.