నింగికి ఎగిసిన పీఎస్ఎల్వీ-సి45
- కొనసాగుతున్న ప్రయోగం
- శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడుతున్న శాస్త్రవేత్తలు
- అంతా సజావుగా సాగుతున్న వైనం
కాగా, ఈసారి ప్రయోగంలో ప్రధానంగా ఎమిశాట్ ఉపగ్రహం గురించి చెప్పుకోవాలి. భారతదేశ రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డీఆర్డీవో సంస్థ ఎమిశాట్ కు రూపకల్పన చేసింది. ఈ ప్రయోగంలో స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా, లిథువేనియా దేశాలకు చెందిన 28 నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ తనతో పాటు తీసుకెళ్లింది.