‘జనసేన’ను ఎన్ని స్థానాల్లో గెలిపించినా మనస్ఫూర్తిగా తీసుకుంటాం: పవన్ కల్యాణ్

  • ఎన్ని స్థానాల్లో గెలుస్తామో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్యుడిని కాదు
  • పోరాటం చేయడం నా ధర్మం
  • దేశం, సమాజమే నాకు ముఖ్యం
ఈ ఎన్నికల్లో ‘జనసేన’ను  ప్రజలు ఎన్ని స్థానాల్లో గెలిపించినా మనస్ఫూర్తిగా తీసుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘టీవీ 5’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జనసేనతో పొత్తు ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న స్థానాల్లో, ఎన్ని స్థానాల్లో గెలుస్తామనేది చెప్పడానికి ‘నేనేమీ జ్యోతిష్యుడిని కాదు’ అని అన్నారు. ‘పోరాటం చేయడం నా ధర్మం. ప్రజలు ఇచ్చిన ఫలితాలను చాలా మనస్ఫూర్తిగా తీసుకుంటాను’ అని అన్నారు. దేశం, సమాజమే తనకు ముఖ్యమని, వాటి కోసం నిబద్ధతతో ఉంటానని చెప్పారు.
Go Back to Shorts
Jana sena
Pawan Kalyan
Elections
cpi
cpm

More Telugu News