ఇక అమెరికా వంతు... మసూద్‌ను టార్గెట్ చేసిన అగ్రరాజ్యం!
- బ్లాక్ లిస్టులో చేర్చేందుకు తీర్మానం
- ఇప్పటికే ప్రాన్స్ నిర్ణయాత్మక చర్యలు
- పాక్ ప్రేరేపిత ఉగ్రవాది చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఈ తీర్మానంలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది. ‘ఈ జైషే నేతకు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఆయా సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, వారి దాడులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలపడం వంటివి చేశారు. అందువల్ల చర్యలు తీసుకోవడం తప్పనిసరి’ అంటూ ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
రెండు వారాల క్రితం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ విజ్ఞప్తి మేరకు భద్రతా మండలి తీర్మానం చేస్తే వీటో అధికారం ఉన్న చైనా అడ్డుకుంది. తాజాగా అమెరికా చేసిన ప్రతిపాదనపై డ్రాగన్ కంట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.