వాయిదా పడనున్న 'డియర్ కామ్రేడ్'?
Add ap7am to your home Screen

వాయిదా పడనున్న 'డియర్ కామ్రేడ్'?

  • నాలుగు భాషల్లో 'డియర్ కామ్రేడ్'
  • అదే రోజున థియేటర్లకు 'ఎన్జీకే'
  • 'డియర్ కామ్రేడ్' జూన్ 6కి వెళ్లే ఛాన్స్
విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమాపైనే దృష్టిపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ .. బిగ్ సినిమాస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను మే 31వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేయాలని భావించారు.

అయితే అదే రోజున సూర్య హీరోగా 'ఎన్జీకే' సినిమా థియేటర్లకు రానుంది. తాజాగా ఈ సినిమా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం 'డియర్ కామ్రేడ్'కి ఇబ్బందిగా మారింది. తెలుగు .. తమిళ భాషల్లో సూర్య మూవీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో, రంజాన్ పర్వదినం సందర్భంగా 'డియర్ కామ్రేడ్' ను జూన్ 6వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.
vijay devarakonda
rashmika

More Telugu News