ఇందిరా గాంధీ లాంటి ముక్కు ఉన్నంత మాత్రాన అధికారంలోకి రాలేరు!: ప్రియాంకపై కేంద్ర మంత్రి విమర్శలు
- అలాగైతే చైనాలో ఇంటికొక అధ్యక్షుడు ఉంటారు
- కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ విమర్ళలు
- మాండవీయ వ్యాఖ్యలను తప్పుపడుతున్న నెటిజన్లు
‘ప్రియాంకా గాంధీకి తన నానమ్మ ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉందని అందరూ అంటున్నారు. మీరు మీ ముక్కు వల్ల అధికారంలోకి రాగలిగితే, చైనాలో ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడు కదా?’ అని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో టాప్-జీన్స్ వేసుకుని తిరిగే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రాగానే శారీ, సిందూరం ధరిస్తారని బీజేపీ నేత హరీశ్ ద్వివేదీ వ్యాఖ్యానించి ఇబ్బందుల్లో పడ్డారు.