ప్యాకేజీ, పావలా ఎవరు? అని అడిగితే పాలు తాగే పిల్లాడు కూడా చెబుతాడు!: పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు
Add ap7am to your home Screen

ప్యాకేజీ, పావలా ఎవరు? అని అడిగితే పాలు తాగే పిల్లాడు కూడా చెబుతాడు!: పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • తాను అమ్ముడుపోయి టికెట్లను అమ్ముకున్నాడు
  • అలాంటి వ్యక్తికి విలువల గురించి ఏం తెలుసు?
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ప్యాకేజీ, ప్రీపెయిడ్, పార్టనర్, పావలా అంటే ఎవరు?’ అని రాష్ట్రంలో పాలుతాగే పిల్లాడిని అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు. తాను అమ్ముడుపోయిన, టికెట్లను ఇతరులకు అమ్ముకునే అజ్ఞానికి విలువల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. పవన్ తీరు డబ్బు ముట్టిందా? గెంతులు వేశామా? షో అయిపోయిందా? అన్న రీతిలోనే ఉంటుందని దుయ్యబట్టారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘ప్యాకేజీ, ప్రీపెయిడ్, పార్టనర్, పావలా...ఈ పేర్లతో ఎవర్ని పిలుస్తారో రాష్ట్రంలో పాలు తాగే పిల్లాడినడిగినా తడుముకోకుండా చెబుతాడు. తను అమ్ముడు పోయి, టికెట్లను మరొకరికి అమ్ముకొనే అజ్ఞానికి విలువల గురించి ఏం తెలుసు? డబ్బు ముట్టిందా? గెంతులేసామా? షో అయిపోయిందా? ఇలాగే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Jana Sena
Pawan Kalyan
Twitter

More Telugu News