మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ సమావేశం... చంద్రబాబు గురించి చర్చ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ సమావేశం... చంద్రబాబు గురించి చర్చ!

  • చంద్రబాబు ఇలాంటివాడా?
  • ఆశ్చర్యం వ్యక్తం చేసిన వర్మ
  • వరుస ట్వీట్లతో కలకలం
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరస్పరం పూర్తిగా భిన్నమైన వ్యక్తులు! తెలుగు రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబును రామ్ గోపాల్ వర్మ కలవడం చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల క్రితమే ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మోహన్ బాబు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. మరోవైపు, వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో చంద్రబాబు వర్గీయులకు కంటకంగా మారారు.

ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబును ఆర్జీవీ కలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చుని సీరియస్ గా డిస్కస్ చేస్తున్న ఫొటోను వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఇలాంటివాడా! అంటూ విస్మయం వ్యక్తం చేస్తూ కొన్ని ఎమోజీలను కూడా తన ట్వీట్ లో చొప్పించారు. ఈ సందర్భంగా వెన్నుపోటుదారులను చెంపకేసి కొట్టాలనిపిస్తోందని, మోహన్ బాబు గారిని అభినందించాలనిపిస్తోందని పేర్కొన్నారు. మోహన్ బాబు సర్ కనీసం మీరైనా ఇప్పుడు ఎన్సీబీఎన్ (చంద్రబాబు) గురించి అసలైన నిజాలు చెప్పడం సంతోషం కలిగిస్తోందని వర్మ వ్యాఖ్యానించారు.

Chandrababu
RGV

More Telugu News