సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఈ నెలలోనే సెట్స్ కి అనుష్క 'సైలెన్స్'
  • అల్లు అర్జున్ సినిమాలో బాలీవుడ్ నటుడు 
  • 'రొమాంటిక్'లో తమిళ టీవీ యాంకర్ 
  • కంగనకు 'తలైవి' కోసం భారీ పారితోషికం
*  'భాగమతి' సినిమా తర్వాత అనుష్క కొంత గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రం 'సైలెన్స్'. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. కాగా, ఇందులో అనుష్క పాత్ర చాలా ఫెరోషియస్ గా ఉంటుందట.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను తీసుకోవాలని నిర్ణయించి, ప్రస్తుతం ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారట.
*  ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న 'రొమాంటిక్' చిత్రం క్యాస్టింగ్ లో మరో నటి కూడా చేరింది. తమిళనాట పలు కార్యక్రమాల ద్వారా పాప్యులర్ అయిన యాంకర్ దివ్యదర్శిని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.  
*  'తలైవి' పేరిట తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో జయలలితగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనుంది. విశేషం ఏమిటంటే, ఇందుకు గాను కంగన 24 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటోందట.
Go Back to Shorts
Anushka Shetty
Allu Arjun
Trivikram
Puri Jagannadh

More Telugu News