చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సంచలన విమర్శలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సంచలన విమర్శలు!

  • చంద్రబాబు సోదరి కుమార్తెనే పెళ్లి చేసుకున్నా
  • ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పెట్టారు
  • సొంత చెల్లెళ్లనే పట్టించుకోని చంద్రబాబు
చంద్రబాబును తానెంతో నమ్మానని, అయినా ఆయన తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సొంత సోదరి కూతురినే తనకు ఇచ్చి వివాహం చేశారని గుర్తు చేసుకున్న ఆయన, చంద్రబాబే దగ్గరుండి పెళ్లి చేశారని, నాటి నుంచి ఆయన్ను చాలా దగ్గరగా చూశానని, తననే చాలా ఇబ్బందులు పెట్టి, కష్టాలు పెట్టారని, అవి ఏంటన్నది తాను ప్రత్యేకంగా చెప్పలేనని అన్నారు. ఇప్పుడేదైనా మాట్లాడితే, తాను తప్పు మాట్లాడినట్టుగా వస్తుందని అన్నారు. తనను ఆర్థికంగా కుంగదీయాలని చంద్రబాబు చూశారని, అయినా తాను లొంగకుండా పైమెట్టు మీదనే ఉన్నానని చెప్పారు.

చంద్రబాబు కుటుంబంలో తనతో పాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరని అన్నారు. సొంత చెల్లెళ్ల ఇంట్లోనే దీపం పెట్టలేని ఆయన, ఆంధ్రరాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఇళ్లలో దీపాలేం పెడతారని నిప్పులు చెరిగారు. తాను, భువనేశ్వరి, బాలకృష్ణే తన కుటుంబమని ఆయన అనుకుంటున్నారని, తండ్రిని, తల్లిని, వారి తోబుట్టువులను, తన సొంత తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లను ఆయన మరిచిపోయారని, వారు ఎక్కడున్నారన్న విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Chandrababu
Narne Srinivasarao
Interview

More Telugu News