నామినేషన్‌ వేయడానికి ముందే సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పై కేసు నమోదు
Add ap7am to your home Screen

నామినేషన్‌ వేయడానికి ముందే సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పై కేసు నమోదు

  • రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం
  • ప్రసంగాన్ని రికార్డుచేసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు అందజేత
  • నామినేషన్‌ దాఖలు చేసిన విలక్షణ నటుడు
విలక్షణ నటుడిగా పలు భాషా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న ప్రకాశ్‌రాజ్‌ ఓ వైపు నామినేషన్‌కు వెళ్తుంటే, మరో వైపు కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు ఆయనపై కేసు నమోదు చేయించారు. దీన్ని పట్టించుకోకుండా ప్రకాశ్‌రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్‌ దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే...మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ రోడ్డులో మీడియా, భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించి బహిరంగ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రకాశ్‌రాజ్‌ కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు షేర్‌ చేశారు. అధికారుల ఫిర్యాదుతో కబ్బన్‌ పార్క్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
Karnataka
bengaluru
Prakash Raj
ec case
nomination

More Telugu News