Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వేసవికి సమంత సందడి 
  • 20వ చిత్రంపై ప్రభాస్ దృష్టి 
  • వ్యాపార రంగంలోకి చిన్మయి
*  గతేడాది ఐదు చిత్రాలలో నటించిన అందాల కథానాయిక సమంత ఈ వేసవికి మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ 29న తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్', ఏప్రిల్ 5న 'మజిలీ' విడుదలవుతుండగా, నందిని రెడ్డి రూపొందిస్తున్న 'ఓ బేబీ' కూడా ఈ వేసవిలోనే సందడి చేయనుంది.  
*  'సాహో' చిత్రం పూర్తికానుండడంతో హీరో ప్రభాస్ ఇప్పుడు తన 20వ చిత్రంపై దృష్టి పెట్టాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నేటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందుకోసం అన్నపూర్ణా స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ కూడా వేశారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోంది. 'ఐలీ ఆఫ్ స్కిన్' బ్రాండ్ పేరిట చర్మ సంరక్షణ ఉత్పత్తులను విక్రయించనుంది. ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో మాత్రమే అమ్మకానికి ఉంచుతున్నారు.
Samantha
Prabhas
Pooja
Chinmayi

More Telugu News