కొమరం భీమ్, అల్లూరి బ్రహ్మచారులు కదా?... హీరోయిన్లు, పాటలు, రొమాన్స్ ఎలా?... రాజమౌళి సమాధానమిది!
Add ap7am to your home Screen

కొమరం భీమ్, అల్లూరి బ్రహ్మచారులు కదా?... హీరోయిన్లు, పాటలు, రొమాన్స్ ఎలా?... రాజమౌళి సమాధానమిది!

  • కొమరం భీమ్ కు ఇద్దరు భార్యలున్నారు
  • రామరాజుకు కూడా మరదలు ఉంది
  • ఇది నిజ జీవిత క్యారెక్టర్లపై ఫిక్షనల్ చిత్రమన్న రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' సినిమాపై మీడియా సమావేశం తరువాత, పాత్రికేయులు అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఓ పాత్రికేయుడు, కొమరం భీమ్, అల్లూరి బ్రహ్మచారులు కదా?... మీరేమో హీరోయిన్లను పెట్టారు. పాటలు, రొమాన్స్ ఎలా? అని ప్రశ్నించగా, రాజమౌళి స్పందించారు. చరిత్రలో కొమరం భీమ్ కు ఇద్దరు భార్యలు ఉన్నారని గుర్తు చేశారు. అల్లూరి రామరాజు సైతం తాను సీతారామరాజుగా మారకముందు మరదలితో రొమాన్స్ చేశారని అన్నారు. ఇది ఫిక్షనల్ చిత్రమని, నిజ జీవిత క్యారెక్టర్ల ఆధారంగా నడుస్తుందని అన్నారు. గత శతాబ్దం తొలినాళ్లలో తెలంగాణ వీరుడు, ఆంధ్రా వీరుడు కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహాజనిత కథే ఇదని వెల్లడించారు.
Rajamouli
NTR
Ramcharan

More Telugu News