రాజమండ్రి టికెట్‌ను స్థానికేతరులకు కేటాయించవద్దు: టీడీపీ కార్పోరేటర్లు

  • టికెట్ల కేటాయింపు విషయంలో ఆందోళనలు
  • గన్ని కృష్ణకే రాజమండ్రి స్థానాన్ని కేటాయించాలి
  • పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు
ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ టికెట్ల కేటాయింపుపై దృష్టి సారించాయి. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో పలు చోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి ఎంపీ టికెట్‌ను స్థానికేతరులకు కేటాయించవద్దంటూ టీడీపీ కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ టికెట్‌ను స్థానికుడైన గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గన్ని కృష్ణకే ఇ్వవాలని ఆయన అనుచరులతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి గన్ని కష్టపడుతున్నారని, కాబట్టి ఎంపీ టికెట్ ఆయనకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Ganni Krishna
Telugudesam
Rajamundry
MP Ticket

More Telugu News