కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్.. గ్రామగ్రామానికి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తానని ప్రకటన
- కాంగ్రెస్‌లో చేరడం ఆనందంగా ఉంది
- మహాత్మాగాంధీ ఇదే రోజు దిండి మార్చ్ ప్రారంభించారు
- పోటీ విషయం అధిష్ఠానం నిర్ణయిస్తుంది
ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. ఇదే రోజు మహాత్మాగాంధీ దిండి మార్చ్ ప్రారంభించారన్నారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ వంటి దిగ్గజాల సారధ్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది.. అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. దానిని తాను గౌరవిస్తానని అన్నారు. గ్రామగ్రామానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.