లగడపాటితో కలిసి అర్ధరాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లిన వంగవీటి రాధా!
- గత నెలలో వైసీపీకి రాధా రాజీనామా
- ఇంకా టీడీపీలో చేరని వంగవీటి
- రాజకీయ భవిష్యత్ పై బాబుతో చర్చలు
- రెండు గంటలకు పైగా సమావేశం
ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి వంగవీటి రాధా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రహస్య మంతనాలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య భేటీ జరిగినట్టు సమాచారం. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుతో మాట్లాడేందుకు రాధా వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే, ఎక్కడి నుంచి పోటీకి దింపాలన్న విషయంలోనూ సందిగ్ధత ఇంకా వీడలేదు. రాధా అభిమానులు మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమైతే బాగుంటుందని అంటున్నారు.