తమ అభిమానులను మెప్పించేందుకు స్టార్ హీరోలు ఎంత రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశాలు, స్టెప్పులు వేసేటప్పుడు హీరోలు గాయాలపాలు కావడం జరుగుతూనే ఉంటుంది. తాజాగా తమిళ నటుడు విశాల్ కు కూడా ఇదే ఎదురైంది.

తెలుగులో ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాను తమిళంలో 'అయోగ్య'గా విశాల్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో విశాల్ గాయపడ్డాడు. ఒక కష్టమైన స్టెప్ ను ప్రాక్టీస్ చేసే సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన మోచేతికి, కాలికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న విశాల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.