వైసీపీ కేంద్రపాలక మండలి సభ్యునిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ!

  • ఇటీవలే పార్టీలో చేరిన నార్నె శ్రీనివాసరావు
  • కీలక బాధ్యతలు అప్పగించిన జగన్‌
  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పార్టీ వర్గాలు
ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్రపాలక మండలి సభ్యునిగా నియమిస్తూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నార్నె శ్రీనివాసరావు ఫిబ్రవరి 28వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనకు కీలక పదవి దక్కడం గమనార్హం.
Go Back to Shorts
YSRCP
Jagan
narne srinivasarao
junior NTR

More Telugu News