Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఆపాలంటే నన్ను చంపాలి.. ఒకవేళ అడ్డుకుంటే యూట్యూబ్ లో విడుదల చేస్తాం!: రాంగోపాల్ వర్మ

  • ఈ సినిమా రిలీజ్ ను ఎవ్వరూ అడ్డుకోలేరు
  • నాకేదయినా అయితే హార్డ్ డిస్క్ లో మొత్తం సేవ్ చేశా
  • యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని చీటీ రాసిపెట్టా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కొంచెం గడుసుగానే జవాబిచ్చారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ కాకుండా ఎవ్వరూ ఆపలేరని వర్మ స్పష్టం చేశారు. ఒకవేళ సినిమా ఆపాలనుకుంటే తనను చంపేయాలని వ్యాఖ్యానించారు. అలాంటిది ఏదైనా జరిగితే దానికి కూడా ఇంకో మార్గం ఆలోచించి పెట్టానన్నారు. ‘ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు’ అని వర్మ స్పష్టం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Tollywood
lakshmies ntr
RGV

More Telugu News