'ఆర్ ఆర్ ఆర్'మ్యూజిక్ సిటింగ్స్ లో కీరవాణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ ఆర్ ఆర్'మ్యూజిక్ సిటింగ్స్ లో కీరవాణి

  • సంగీత దర్శకుడిగా కీరవాణి స్థానం ప్రత్యేకం
  • రాజమౌళితో సుదీర్ఘ ప్రయాణం
  • రాజమౌళి హిట్స్ లో ముఖ్యమైన పాత్ర
అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఒకదానికొకటి సంబంధం లేని కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. రాజమౌళి సినిమాల విజయంలో సంగీత దర్శకుడిగా కీరవాణి పాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. 'సింహాద్రి' .. 'ఛత్రపతి' .. 'మగధీర' .. 'బాహుబలి' .. ఇలా రాజమౌళి సినిమాలు పాటల పరంగాను మంచి మార్కులు తెచ్చుకోవడం వెనుక కీరవాణి కృషి ఎంతో వుంది.

రాజమౌళికి .. ఆయన అభిమానులకి ఎలాంటి పాటలు కావాలనేది కీరవాణికి తెలుసు గనుకనే, వాళ్లిద్దరి ప్రయాణం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. రాజమౌళి తాజా చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్'కి కూడా కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతూ ఉండటంతో, మ్యూజిక్ సిటింగ్స్ అక్కడే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
rajamouli

More Telugu News