అశోక్-లోకేశ్ మంచి ఫ్రెండ్స్.. మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలి: టీఆర్ఎస్ నేత బాల్క సుమన్
- అమరావతిలో పటిష్ట భద్రత మధ్య అశోక్ ను ఉంచారు!
- ఒకప్పుడు లాడెన్ కు కూడా పాక్ అంత భద్రతనివ్వలేదు
- మా కోపం చంద్రబాబుపైనే.. అక్కడి ప్రజలపై కాదు
ఏపీ సీఎం చంద్రబాబుపై తమకు కోసం ఉంది కానీ, అక్కడి ప్రజలపై లేదని అన్నారు. తాము ఎవరిపైనా కక్ష గట్టలేదని, ఆంధ్రా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, ప్రాంతాలు విడిపోయినా ప్రజలు కలిసి ఉండాలన్నది తమ అభిమతమని చెప్పారు. విభజన వికాసానికే అన్న కాన్సెప్ట్ తమదని, మొదటి నుంచి చంద్రబాబుతో కేసీఆర్ సఖ్యతగానే ఉన్నారని, వక్రబుద్ధి ఉన్న బాబే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని బాల్క సుమన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.