విజయ్ కారును అనుసరిస్తూ ఇబ్బంది పెట్టిన అభిమానులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ కారును అనుసరిస్తూ ఇబ్బంది పెట్టిన అభిమానులు

  • విజయ్ కి విపరీతమైన క్రేజ్ 
  • అట్లీకుమార్ షూటింగుతో బిజీ
  • విజయ్ ని టెన్షన్ పెట్టిన ఫ్యాన్స్
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయనతో అవుట్ డోర్ లో షూటింగ్ చేయడమనేది దర్శకులకు సాహసమే అవుతుందని చెప్పుకుంటూ వుంటారు. ఆయన షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఆ రేంజ్ లో అభిమానులు అక్కడికి చేరుకుంటూ వుంటారు. వాళ్లు తమ అభిమానాన్ని ప్రదర్శించే తీరు ఒక్కోసారి విజయ్ ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు వున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మరోసారి జరిగింది.

ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక కాలేజ్ లో ఈ సినిమా షూటింగును ముగించుకుని విజయ్ తన కారులో ఇంటికి బయలుదేరాడు. కొంతమంది కుర్రాళ్లు 'తలైవా .. తలైవా' అని పిలుస్తూ తమ బైకులతో ఆయన కారును అనుసరించారు. వాళ్లు కారుతో సమానంగా బైకులపై వస్తుండటంతో కంగారు పడిన విజయ్, కారు అద్దం కిందికి దించి .. ఆగిపొమ్మనీ .. వెనక్కి వెళ్లిపొమ్మని సైగ చేశాడు. కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటనే అజిత్ కి కూడా ఎదురైన సంగతి తెలిసిందే.
vijay

More Telugu News