రేపు కలసి ఇంకోసారి చర్చిద్దాం.. గుంటూరు జిల్లాలో అసంపూర్తిగా ముగిసిన చంద్రబాబు భేటీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం అసంపూర్తిగా ముగిసింది. గుంటూరు లోక్ సభకు గల్లా జయదేవ్, తెనాలి నుంచి ఆలపాటి రాజా, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర అభ్యర్థిత్వాలను చంద్రబాబు ఖరారు చేశారు.

అయితే మిగతా ఐదు నియోజకవర్గాలు.. గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈరోజు టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అర్థాంతరంగా ముగిసింది. కాగా, ఈ విషయమై రేపు మరోసారి చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Guntur District
5 assembly seats

More Telugu News