భారత పైలట్ అనుకుని తమ పైలట్‌నే చావబాదిన పాకిస్థానీలు

01-03-2019 Fri 08:58 | National
  • పాక్ భూభాగంలో పడిన అభినందన్, పాక్ పైలట్
  • పాక్ పైలట్‌ను భారత పైలట్‌గా భ్రమపడిన ప్రజలు
  • చితకబాదడంతో అపస్మారక స్థితిలోకి..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయడంతో ఉడికిపోతున్న పాకిస్థానీలు.. భారత పైలట్ అనుకుని సొంత పైలట్‌నే చితకబాదారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చివేశాడు.

పాక్ జరిపిన దాడిలో అభినందన్ మిగ్ విమానం కూలిపోయింది. దీంతో ఆయన పారాచూట్ సాయంతో సురక్షితంగా కిందికి దిగాడు. అలాగే, కూలిన ఎఫ్-16 విమానం నుంచి పాక్ పైలట్ కూడా కిందికి దిగాడు. పాక్ భూభాగంలో అడుగుపెట్టిన అభినందన్‌ను బందీగా పట్టుకున్న పాక్ ప్రజలు.. మరోవైపు తమ పైలట్‌ విషయంలోనూ పొరపాటు పడ్డారు. తమ పైలట్‌ను భారత పైలట్‌గా భావించి చితకబాదారు.

ఆయనపై రెచ్చిపోయి దాడిచేయడంతో పాక్ పైలట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పైలట్‌ను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం సైన్యానికి సమాచారం అందించారు. తొలుత అతడు భారత్ పైలట్ అని భ్రమపడిన సైన్యం కూడా ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించింది.  అనంతరం అసలు విషయం తెలిసి నాలుక్కరుచుకుని ఒక్క భారత పైలట్ మాత్రమే తమ అధీనంలో ఉన్నట్టు ప్రకటించింది.
PakistanIAFAbhinandan varthamanPOK

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more