శింబు నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను: హీరోయిన్ ఓవియా
- తమిళంలో బిజీ అయిన 'ఓవియా'
- శింబు నాకు మంచి స్నేహితుడు
- ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుంటాడు
శింబు మంచి స్నేహితుడు .. నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుంటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను" అంటూ ఓవియా చెప్పుకొచ్చింది.