దాడి జరిగిన రాత్రంతా మోదీ జాగారం.. కునుకు లేకుండా క్షణక్షణం పర్యవేక్షించిన ప్రధాని
- సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పర్యవేక్షణ
- పైలట్లు సురక్షితంగా ల్యాండయ్యాకే దైనందిన కార్యక్రమాలు
- దాడిలో పాల్గొన్న పైలట్లకు మోదీ అభినందనలు
సోమవారం రాత్రి ఓ టీవీ చానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మోదీ రాత్రి 9:15 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నివాసానికి చేరుకున్నారు. పది నిమిషాల్లోనే డిన్నర్ పూర్తిచేసి పాక్ భూభాగంలో నిర్వహించనున్న మెరుపు దాడుల పర్యవేక్షణలో మునిగిపోయినట్టు సమాచారం. ఆపరేషన్ ముగిసిన వెంటనే పైలట్ల యోగక్షేమాల గురించి ప్రధాని ఆరా తీశారు. అనంతరం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆపరేషన్‌లో పాల్గొన్న పైలట్లకు ప్రధాని అభినందనలు తెలిపారు.