nara lokesh: ఉగ్ర తండాలను ధ్వంసం చేసిన వాయుసేనకు కంగ్రాట్స్: నారా లోకేష్

  • వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రశంసలు జల్లు
  • విజయవంతంగా దాడులు నిర్వహించారన్న లోకేష్
  • గర్వంతో శాల్యూట్ చేస్తున్నానంటూ ట్వీట్
నియంత్రణరేఖకు అవతలి వైపున ఉన్న ఉగ్రతండాలపై భారత వాయుసేన ఈ తెల్లవారుజామున సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వాయుసేనపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు సర్జికల్ దాడులను హర్షిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, 'నియంత్రణరేఖ వెంబడి ఉన్న ఉగ్ర తండాలపై విజయవంతంగా దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అభినందనలు. ఎంతో గర్వంతో మీకు శాల్యూట్ చేస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.
nara lokesh
surgical strikes
indian air force

More Telugu News