అసెంబ్లీలో తన లవ్ స్టోరీ గురించి వివరించిన ఎమ్మెల్యే బాల్క సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీలో తన లవ్ స్టోరీ గురించి వివరించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

  • 2012లో ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యా
  • నాకు ఏమీ లేదని పిల్లనిచ్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు
  • వారిని పద్మారావు ఒప్పించి, దగ్గరుండి పెళ్లి చేయించారు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన లవ్ స్టోరీ గురించి చెప్పి, అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఎంపికైన నేపథ్యంలో మాట్లాడుతూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అసెంబ్లీలో దీని గురించి చెప్పొచ్చో, లేదో తనకు తెలియదని అని అంటూనే బాల్క సుమన్ అంతా వివరించారు. తాను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పద్మారావు తనకు ఎంతో సహకరించారని చెప్పారు. 2012లో తాను ప్రేమ వివాహానికి సిద్ధమైనప్పుడు, తనకు ఏమీ లేదని పిల్లనిచ్చేందుకు అత్తామామలు ఒప్పుకోలేదని... మీ సామాజికవర్గానికి చెందిన ఆ అమ్మాయి తల్లిదండ్రులను మీరు (పద్మారావు), పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రవణ్ లు పెద్ద మనసుతో ఒప్పించారని తెలిపారు.

'మంచి పిలగాడు, మంచి పొజిషన్ లో ఉంటాడు, ఎమ్మెల్యే అవుతాడు, కేసీఆర్ కు దగ్గరవుతాడు అని ఒప్పించారు. ఆ తర్వాత దగ్గరుండి నా పెళ్లిని జరిపించారు. అందుకు మీకు ధన్యవాదాలు చెబుతున్నా' అని తన లవ్ స్టోరీ గురించి వివరించారు. ఈ సందర్భంగా పద్మారావు అప్పటి విషయాలను గుర్తు తెచ్చుకుని, నవ్వును ఆపుకోలేకపోయారు.
balka suman
TRS
love
story
padma rao
assembly

More Telugu News