చిరంజీవి టైటిల్‌తో రాబోతున్న నాని

‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం చిత్రం టైటిల్‌ను ప్రకటించింది. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తోనే నాని రాబోతున్నాడు. మైత్రి మూవీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. నాని 24వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

 ఈ చిత్రంలో నాని నవలా రచయితగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టైటిల్ విషయమై నాని ట్వీట్ చేశాడు. ‘గడ్డంతో కూడిన లుక్, చేతుల్లో వెల్డింగ్ గన్.. ఇప్పటికీ గుర్తు. చిన్నారిగా మొదటి రోజు మొదటి షో.. మిగిలినదంతా చరిత్ర. ఒక అభిమాని నాని 24 టైటిల్ ప్రకటిస్తున్నాడు’ అంటూ టైటిల్‌ గురించి వివరిస్తున్న ఓ చిన్న వీడియోను నాని షేర్ చేశాడు.
Go Back to Shorts
Nani
Vikram K Kumar
Chiranjeevi
Gang Leader
Karthikeya

More Telugu News