‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల!
Add ap7am to your home Screen

‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల!

  • ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య ప్రేమానురాగాల నేపథ్యంలో పాట
  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం
  • సంగీతం అందించిన కల్యాణీ మాలిక్
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ తో పాటు రెండు పాటల రిలీజ్ తో వేడి పెంచిన వర్మ తాజాగా సినిమాలోని ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అనే పాటను వర్మ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పాటను సిరాశ్రీ రాయగా, లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్‌ సంగీతమందించారు. ఈ సినిమాను మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Tollywood
lakshmies ntr
first video song
release

More Telugu News