చంద్రబాబూ.. రాత్రికిరాత్రి హైదరాబాద్ నుంచి సర్దుకుని వచ్చేశారుగా.. అప్పుడెవరు వార్నింగ్ ఇచ్చారు?: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత కౌంటర్
- ఏపీ సీఎంకు ప్రపంచమంతటా ఆస్తులున్నాయని ఆరోపణ
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘టీడీపీ నాయకులను వైసీపీలో చేరమని హైదరాబాద్ లో బెదిరిస్తున్నారని నాయుడుబాబు కలవర పడుతున్నారు. మీకు ప్రపంచమంతా ఆస్తులున్నాయి. ఎవరైనా బెదిరించారా? 10 సంవత్సరాల రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ. అప్పుడెవరు వార్నింగ్ ఇచ్చారో చెప్పండి’ అని ట్వీట్ చేశారు.