పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌సిద్ధూపై పెల్లుబుకుతున్న ఆగ్రహం

  • పుల్వామా దాడి ఘటన అనంతరం సంచలన వ్యాఖ్యలు
  • మాజీ క్రికెటర్‌ తీరును తప్పుపట్టిన జనం
  • తాజాగా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం నాటి పోస్టర్లతో విమర్శలు
జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్‌ ఉగ్రవాది దాడుల అనంతరం సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌సిద్ధూపై జనం ఆగ్రహం పెల్లుబుకుతోంది. రకరకాల మార్గాల్లో ఈ మాజీ క్రికెటర్‌పై నెటిజన్లు, సాధారణ జనం విరుచుకుపడుతున్నారు. తాజాగా, పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సిద్ధూ ఆ సందర్భంగా పాకిస్థాన్‌ ఆర్మీచీఫ్‌ను కౌగిలించుకున్న ఫొటోతో కూడిన పోస్టర్లు వెలిశాయి. ‘జనరల్ బజ్వా కా యార్, సిద్ధూ దేశ్ కా గద్దార్’ అంటూ పోస్టర్లలో రాశారు. పాక్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ శిరోమణి అకాలీ ‌దళ్ ఎమ్మెల్యే ఆందోళన చేశారు.
Go Back to Shorts
pulwama
navajyothsing sidhu
posters

More Telugu News