మహేశ్ నిర్ణయాన్ని దిల్ రాజు ఒప్పుకోక తప్పలేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ నిర్ణయాన్ని దిల్ రాజు ఒప్పుకోక తప్పలేదట!

  • మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి'
  • 26వ సినిమా అనిల్ రావిపూడితో 
  • నిర్మాణ భాగస్వామిగా అనిల్ సుంకర    
మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. ఈ సినిమాను సోలో నిర్మాతగా నిర్మించాలని దిల్ రాజు భావించారు. అయితే అశ్వనీదత్ .. పీవీపీలతో కలిసి ఈ సినిమా చేయక తప్పలేదు. మహేశ్ బాబు 26వ సినిమానైనా తాను ఒక్కడినే నిర్మించాలనే నిర్ణయంతో దిల్ రాజు వున్నారట. ఇది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే సినిమా కావడంతో, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో దిల్ రాజు వున్నారు. అందువలన తాను మాత్రమే నిర్మాతగా ఉండాలనే ఉద్దేశంతో ఆ దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేశారట.

అయితే గతంలో తన సినిమా వలన నష్టపోయిన అనిల్ సుంకరకి హెల్ప్ చేయడం కోసం ఆయన నిర్మాతగా ఒక సినిమా చేస్తానని చెప్పాననీ, ఈ సినిమాకి ఆయన కూడా ఒక నిర్మాతగా ఉంటారని మహేశ్ బాబు స్పష్టం చేశాడట. తప్పనిసరి పరిస్థితుల్లో మహేశ్ బాబు నిర్ణయాన్ని దిల్ రాజు ఒప్పుకోవలసి వచ్చిందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆ తరువాత సినిమాకైనా సోలో నిర్మాతగా దిల్ రాజుకి ఛాన్స్ దొరుకుతుందేమో చూడాలి. 
Mahesh Babu
Dil Raju

More Telugu News