రోగానికి చికిత్స పొందుతూనే... ఉగ్రవాదులకు మసూద్ అజర్ ఆదేశాలు!
- రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స
- పుల్వామా దాడికి 8 రోజుల ముందు సందేహం
- ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపు
దాడికి వారం రోజులకు ముందుగానే మసూద్ నుంచి ఓ ఆడియో సందేహం ఉగ్రవాదులకు అందింది. ఓ ఉగ్రవాదిని ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసిన తరువాత, అటాక్ కు పురమాయిస్తూ, తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని, ఈ దాడికి ప్లాన్ చేశాడు. అతని సూచన మేరకే అబ్దుల్ రషీద్ ఘాజీ భారీ బాంబును తయారు చేసి ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ లో అమర్చాడు.
కాగా, గత నాలుగు నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్న మసూద్ అజర్, గడచిన ఆరు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనలేదు. ఇండియాపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్న మసూద్, పుల్వామా టెర్రర్ దాడికి ఎనిమిది రోజుల ముందు యాక్టివ్ అయ్యాడు. ఉగ్రవాదులకు ఇచ్చిన ఆడియో సందేశంలో, ఈ యుద్ధంలో మరణానికి మించిన గౌరవం మరొకటి లేదని కూడా మసూద్ వ్యాఖ్యానించాడు.