అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

  • విచక్షణ రహితంగా ఉన్మాది కాల్పులు
  • ఆరుగురు దుర్మరణం.. ఐదుగురికి గాయాలు
  • పశ్చిమ షికాగోలో ఘటన
అమెరికాలోని పశ్చిమ షికాగోలో తుపాకి మరోమారు గర్జించింది.  ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది సహా ఐదుగురు గాయపడ్డారు. పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమ హెన్రీ ప్రాట్ కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ (45) ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మార్టిన్‌ను కాల్చి చంపారు. మార్టిన్ దారుణానికి పాల్పడడం వెనక ఉన్న కారణం తెలియరాలేదు.
Go Back to Shorts
America
Gun shooting
aurora
Chicago
Illinois

More Telugu News