రాహుల్, జగన్ ల ఫొటోలతో.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి ప్రమోషన్ చేస్తున్న వర్మ!
- ట్విట్టర్ లో ఫన్నీ మెమెలు పోస్ట్ చేసిన దర్శకుడు
- జగన్ ఇంత సీరియస్ గా ఉండటం చూడలేదని వ్యాఖ్య
- 15 లక్షలు దాటిన సినిమా ట్రైలర్ వ్యూస్
జగన్ పాదయాత్రలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ను చూస్తున్నట్లు మెమెను పోస్ట్ చేసిన వర్మ..‘జగన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను చూస్తున్నంత సీరియస్ గా ఇటీవలికాలంలో దేన్నీ చూడలేదు’ అని ట్వీట్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ మెమెను పోస్ట్ చేసి..‘టీడీపీతో పొత్తుపై రెండో ఆలోచనలు ఉన్నాయా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
