వైసీపీ కార్యకర్త శివతో నేను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్

శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన వైసీపీ కార్యకర్త శివను ఫోన్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బెదిరించిన విషయమై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ విషయమై కూన రవికుమార్ స్పందిస్తూ, తాను మాట్లాడింది ఏ వ్యక్తి అయితే రికార్డు చేశారో, వాళ్లు గల్లీలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక, ఆ రకంగా ప్రవర్తించారని విమర్శించారు. అతనితో తాను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పూ లేదని అన్నారు.

ఒక రాజకీయ పార్టీకి చెందిన జెండాలు లేదా ఫ్లెక్సీలను వేరే వాళ్లెవరైనా వాటిని చించినా, తొలగించినా నేరమని, అటువంటి తప్పుడు పని చేసిన వాడికి ‘అది తప్పు’ అని ‘వార్నింగ్’ ఇచ్చానని అన్నారు. అంతేతప్ప, తానేమీ తప్పు చేయలేదని, ఎవరితో నైనా నిర్భయంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. అతనికి, అతని కుటుంబానికి సాయం చేశానని, పెట్టే వాడికి దండించే అధికారం ఉంటుందని, అందుకే, తప్పుదోవలో ఉన్న శివను మందలించాల్సి వచ్చిందని కూన రవికుమార్ సమర్థించుకున్నారు. 
Go Back to Shorts
Telugudesam
kuna ravi kumar
YSRCP
shiva
srikakulam

More Telugu News