రాజమౌళి సినిమాను అజయ్ దేవగణ్ అందుకే ఒప్పుకున్నాడట
- షూటింగు దశలో రాజమౌళి సినిమా
- కథను మలుపు తిప్పే పాత్ర
- 'ఈగ' హిందీ వెర్షన్ నుంచి మంచి సాన్నిహిత్యం
తనకి రాని భాషలో నటించడం అజయ్ దేవగణ్ కి ఇష్టం వుండదు. ఈ కారణంగానే ఆయన 'భారతీయుడు 2' నుంచి వచ్చిన ఆఫర్ ను కూడా సున్నితంగా తిరస్కరించాడు. అయితే రాజమౌళి మాత్రం .. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ పాత్ర కథను మలుపు తిప్పేది అవుతుందనీ, తెరపై కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని చెప్పి ఒప్పించాడట. 'ఈగ' హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పింది అజయ్ నే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన రాజమౌళి సినిమాను అజయ్ దేవగణ్ చేయడం ఖాయమైపోయిందనే అంటున్నారు.