16వ లోక్‌సభ ముగింపు సందర్భంగా స్పీకర్ విందు ఏర్పాటు

  • రేపటితో ముగియనున్న 16వ లోక్‌సభ
  • విందుకు వివిధ పార్టీల నేతలు హాజరు
  • విందులో ప్రత్యేకం రుచికరమైన లడ్డూ-బాప్లా
16వ లోక్‌సభ రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా నేడు స్పీకర్ సుమిత్ర మహాజన్ విందు ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ పార్టీల నేతలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ విందులో అత్యంత రుచికరమైన లడ్డూ-బాప్లాను వడ్డించారు. ఈ వంటకం సుమిత్ర మహాజన్ స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ ప్రాంతానికి చెందినది కావడం విశేషం. ఈ విందుకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, హోంమంత్రి రాజనాథ్ సింగ్, విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జునఖర్గే తదితరులు హాజరయ్యారు.
Go Back to Shorts
Sumithra Mahajan
Venkaiah Naidu
Mallikarjuna Kharge
Thambidurai
Rajnath Singh

More Telugu News