జనసేన తీర్థం పుచ్చుకున్న విశాఖ మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి

  • 1985లో ఎమ్మెల్యేగా ఎన్నిక
  • పార్టీలో చేరిన రఘురాజ్, సన్యాసినాయుడు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్
విశాఖపట్టణం మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె మనవడు యర్రా రఘురాజ్, నగర మాజీ కార్పొరేటర్ యర్రా సన్యాసినాయుడు తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 1985లో భానుమతి విశాఖ‌-1 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో భానుమతి తదితరులకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Go Back to Shorts
Allu Bhanumathi
Pawan Kalyan
Janasena
Visakhapatnam
Raghuraj
Sanyasinaidu

More Telugu News