ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి ఆమెనే కారణం: కమెడియన్ అలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి ఆమెనే కారణం: కమెడియన్ అలీ

  • నా రెండవ సినిమా 'దేవుడు మావయ్య'
  • నా కోసం ఈ షోకి వచ్చారు 
  • ఓ కొడుకులా నన్ను చూసుకున్నారు        
తెలుగు తెరపై ఒకప్పటి అగ్రకథానాయకుల సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి, ప్రేక్షకుల హృదయాల్లో విజయలలిత ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్ సినిమాల్లోను .. రొమాంటిక్ చిత్రాల్లోను ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక విలనిజాన్ని కూడా ఆమె తనదైన శైలిలో పండించి మెప్పించారు. ఇంటర్వ్యూల పరంగా ఇన్నేళ్లలో ఎప్పుడూ కెమెరా ముందుకురాని ఆమె, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వేదికపై అలీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "నా కోసం .. నా షో కోసం 22 సంవత్సరాల తరువాత విజయలలిత గారు మేకప్ వేసుకున్నారు. నాకు సినిమా జన్మనిచ్చింది ఈ తల్లే. నా రెండవ సినిమా 'దేవుడు మామయ్య'కి ఆమెనే నిర్మాత. మాకు కబురు చేస్తే మా నాన్న నన్ను వెంటబెట్టుకుని చెన్నై తీసుకెళ్లాడు. సినిమా అయ్యేంతవరకూ నాకు వాళ్లింట్లో ఆశ్రయమిచ్చి కన్న కొడుకుకన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఇంతవరకూ 1100 సినిమాలను పూర్తి చేసి నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి ఆమెనే కారణం" అని చెప్పుకొచ్చాడు.
ali
vijaya lalitha

More Telugu News