Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ కంపెనీ క్రీమ్ వాడకుంటే పెళ్లవదా?: హీరోయిన్ శ్రియ

  • కెరీర్ తొలినాళ్లలో సౌందర్య పోషక యాడ్స్ లో నటించిన శ్రియ
  • ఇప్పుడైతే అటువంటివి చేయబోనని వెల్లడి
  • రంగు, పుట్టుకతోనే వస్తుందంటున్న బ్యూటీ
'ఆ కంపెనీ క్రీమ్ వాడకుంటే పెళ్లి కాదా?' అంటోంది మూడున్నర పదుల వయసు దాటినా ఇంకా కుర్రకారు మదిలో తిష్టేసుకుని కూర్చున్న శ్రియ. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తాను ఆది నుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలకు వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆ మధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని తెలిపింది. తొలుత ఆ కమర్షియల్ యాడ్ లో నటించాలని తననే సంప్రదించారని, దాన్ని తాను తిరస్కరించానని చెప్పింది.

"సదరు క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్ళవుతుందా? లేకపోతే కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబంధించిన విషయం. అది స్వతహాగానే వస్తుంది తప్ప ఏ క్రీమ్ లు వాడినా రాదు. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా నేను ఒప్పుకోను" అని ఆమె వ్యాఖ్యానించింది.  

అయితే హీరోయిన్‌ గా రాణించక ముందు కొన్ని సౌందర్య ఉత్పత్తులకు యాడ్స్ చేశారు కదా? అని ప్రశ్నలు అడిగేవాళ్లకు తాను ఒక్కటే సమాధానం చెబుతానని, ఆ సమయంలో తన వయస్సు చాలా తక్కువని, పరిపక్వత లేని సమయంలో ఆ యాడ్స్ చేశానని అంది. ఇప్పుడైతే అటువంటి యాడ్స్ ఒప్పుకోబోనని చెప్పింది. కాగా, తన తర్వాత ఎంతోమంది హీరోయిన్లు వచ్చినా.. అవకాశాలు ఏమాత్రం కోల్పోకుండా తాను మాత్రం ఏదో చిత్రంలోనో, స్పెషల్ సాంగ్ లోనే తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్న శ్రియా, యాడ్స్ విషయంలో మాత్రం ప్రస్తుతం ఆంక్షలు పెడుతోందట!
Sriya
Adds
Commercials
Face Creams

More Telugu News