'మహానాయకుడు'కు గుమ్మడికాయ కొట్టేశారు!

  • ఎన్టీఆర్‌ జీవిత కథలో రెండో భాగం 'మహా నాయకుడు'
  • శనివారంతో షూటింగ్ పూర్తి
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
ఎన్టీఆర్‌ జీవిత కథలో రెండో భాగం 'మహా నాయకుడు' సినిమా షూటింగ్ పూర్తయింది. బాలకృష్ణ హీరోగా, క్రిష్‌ దర్శకత్వంలో పలువురు ప్రముఖ నటీ నటులు నటించగా, తొలి భాగం 'కథానాయకుడు' జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రెండో భాగం షూటింగ్ శనివారంతో హైదరాబాద్ లో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టి షూటింగ్ ముగిసినట్టు అధికారికంగా తెలిపింది. శనివారం నాడు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించినట్టు యూనిట్ పేర్కొంది.

కాగా, ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 7వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం, 'కథానాయకుడు' అనుకున్న స్థాయిలో విజయం సాధించడంలో విఫలం కావడంతో, రెండో చిత్రాన్ని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందించే పనిలో ఉన్నారు. దీంతో విడుదల ఆలస్యమైంది. ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలో ప్రకటిస్తారని సమాచారం.
Go Back to Shorts
NTR
Mahanayakudu
Shooting
Complete

More Telugu News